పత్తికొండ: సాగు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం

57చూసినవారు
పత్తికొండ: సాగు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం
కర్నూలు జిల్లా రైతులకు సాగు, తాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం పత్తికొండ మండలంలో హంద్రీనీవా రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆయన, రాయలసీమ జిల్లాల్లో అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు హంద్రీనీవానే ఒకే ప్రాజెక్టుగా ఉందన్నారు. రిజర్వాయర్, కాల్వకు రూ. 245 కోట్ల నిధులు అవసరమని చెప్పారు.

సంబంధిత పోస్ట్