పత్తికొండ నుండి ఆదోని వెళ్లే రోడ్డులో నలుగదుద్ది గ్రామానికి చెందిన లక్ష్మన్న (50) అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా గుంతలో పడటంతో అదుపు తప్పి కింద పడ్డారు. గాయాలపాలైన లక్ష్మన్నను ఆటో డ్రైవర్లు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గుత్తి నుండి పత్తికొండ మీదుగా ఆదోని వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.