జనవరి 30-31 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఏపీ ఆటో యూనియన్ 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కర్నూలు జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం వెల్దుర్తి ఏఐటీయూసీ కార్యాలయంలో మండల ఆటో యూనియన్ సమావేశం యేసయ్య అధ్యక్షతన జరిగింది. ఆటో కార్మికులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని గుర్తింపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో వారు కోరారు.