పత్తికొండ: ఏడు గ్రామాలకు ఉత్కర్ష్ లబ్ధి, కలెక్టర్ ఆదేశాలు

71చూసినవారు
పత్తికొండ: ఏడు గ్రామాలకు ఉత్కర్ష్ లబ్ధి, కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు జిల్లాలో ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ఏడు గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ మంత్రాలయం, హొళగుంద, మద్దికెర మండలాల పరిధిలోని గ్రామాల్లో గిరిజనుల కోసం గృహాలు, రోడ్లు, నీటి సరఫరా, రేషన్, ఆధార్, గ్యాస్, పింఛన్లు, లోన్లు వంటి పథకాలు అమలవుతాయని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్