పంటల సాగుపై పత్తికొండ వ్యవసాయ సబ్ డివిజన్లోని రైతుసేవా కేంద్రాల సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పత్తికొండలో ఏడీఏ మోహన్ విజయకుమార్, డీఆర్సీ ఏడీఏ బాలవర్ధిరాజు, ఏవో శశిధరరెడ్డి, శాస్త్రవేత్తలు మౌనిక, నాగసరోజ మాట్లాడారు. పప్పుశనగ, వేరు శనగ, పత్తి, మిరప, టమాట, ఉల్లి పంటల సాగుపై శిక్షణ ఇచ్చారు. యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.