పత్తికొండ: అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి

82చూసినవారు
పత్తికొండ: అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పత్తికొండలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ జాతికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు.

సంబంధిత పోస్ట్