క్రిష్ణగిరి మండలం చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన 42 ఏళ్ల బోయ చిన్నరామప్ప ఈనెల 9న పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. భార్య వెంకటేశ్వరమ్మతో డబ్బుల విషయంలో గొడవకు తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో గాలించినా, ఎక్కడా సమాచారం లేదని దీంతో మంగళవారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.