వెల్దుర్తిలో పీటీఆర్ సమస్యతో విద్యుత్ అంతరాయం

83చూసినవారు
వెల్దుర్తిలో పీటీఆర్ సమస్యతో విద్యుత్ అంతరాయం
పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తిలో 11 కేవీ సబ్ స్టేషన్‌లో శనివారం మరమ్మతులు జరుగుతున్నాయి. రెండు ప్రొటెక్షన్ ట్రాన్స్ఫార్మర్లలో ఒకటి దిమ్మె సమస్యతో తొలగించడంతో, ఒక్క పీటీఆర్ కారణంగా విద్యుత్ సరఫరా సమస్యలు పెరిగాయి. వెల్దుర్తి, చెరుకులపాడు, అల్లుగుండు ఫీడర్లలో విద్యుత్ కోతలు జరిగినాయి. త్వరలో మరమ్మతులు పూర్తిచేసి సమస్య పరిష్కరిస్తామని ఇన్‌చార్జి రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్