కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సూదేపల్లె గ్రామంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలను వేసి సత్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ, నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని అంబేద్కర్ గారి ఆశయాలను తెలియజేస్తూ నేటి యువత అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పంచుకున్నారు.