వెల్దుర్తిలో నీటి సమస్యకు టీడీపీ నాయకులే కారణం

133చూసినవారు
వెల్దుర్తి పట్టణంలోని నీటి సమస్యకు టీడీపీ నాయకులే కారణమని శుక్రవారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ బొమ్మన రవిరెడ్డి ఆరోపించారు. ఇటీవల టీడీపీ నేతలు సుబ్బరాయుడు, జ్ఞానేశ్వర్ గౌడ్ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ, ఆయన మాట్లాడారు. రూ. 3. 10 కోట్లతో కృష్ణగిరి నుంచి పైప్‌లైన్ వేసి నీటి సమస్య పరిష్కరించామని తెలిపారు. కానీ టీడీపీ మద్దతుదారులు పైప్‌లైన్ ధ్వంసం చేసి సమస్య సృష్టించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్