కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని అల్లుగుండు నేషనల్ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు కర్నూల్ నుంచి వెల్దుర్తికి బైక్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన అడ్డాకుల చిన్న మునిస్వామి, అనిల్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.