ఎన్నికల హామీ మేరకు కూటమి సర్కార్ అమలు చేసిన తల్లికి వందనం పథకంతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి వెల్దుర్తిలో ఖాతాల్లో నగదు జమ కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒక్కొక్కరికి రూ. 13 వేలు చొప్పున, ఇంట్లో పిల్లల సంఖ్యపై ఆధారపడి ఎక్కువ మొత్తం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.