పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో గత ఆరు నెలలుగా సదరం క్యాంపులు నిర్వహించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరీక్షలు, డిజబిలిటీ ధ్రువీకరణ సేవలు అందక దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పత్తికొండలో సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఇన్చార్జి క్రాంతి నాయుడు ఆర్డీవోకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.