శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 1510 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 1133 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 377 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. అయితే ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్ఫ్లో లేదన్నారు