తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్ళే వాహనాలు డబ్బుకు చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతోంది. సుమారు 6 కి.మీ. వరకు రోడ్డు రద్దీతో నిండిపోగా. పరిస్థితిని అధిగమించేందుకు అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు.