నంద్యాల జిల్లాలో మరో చిరుత కలకలం

1027చూసినవారు
నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. గోశాల ప్రాంగణంలో శనివారం తెల్లవారుజామున చిరుత సంచరించింది. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు గోశాల ప్రాంగణంలో చిరుత సంచరించింది. చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఒక చిరుతను బంధించి 24 గంటలు కాకముందే మరో చిరుత కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్