మహానంది పోలీస్ స్టేషన్ ఎస్సైగా రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రసాద్ ఓ హత్య కేసు వివాదం నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ ఎస్ఐ గా నాగార్జున రెడ్డి వ్యవహరించగా ప్రస్తుతం రెగ్యులర్ ఎస్సైగా రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు.