ఆత్మకూరు: ఆవుదూడను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

70చూసినవారు
ఆత్మకూరు: ఆవుదూడను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
ఆత్మకూరు రహమత్ నగర్‌లోని బావిలో బుధవారం ప్రమాదవశాత్తు ఆవుదూడ పడింది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వెలుపలికి తీసే ప్రయత్నం చేశారు. అయితే తాళ్ల సాయంతో ఆవుదూడను బయటకు తీసేందుకు కష్టతరం కావడంతో హోంగార్డు శ్రీనివాసులు బావిలోకి దిగి దూడను భుజంపై మోసుకొని పైకి తీసుకొచ్చారు. దీంతో ఆయన్ని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్