ఆత్మకూరు పట్టణానికి కొద్ది దూరంలో నంద్యాల సర్కిల్ దాటిన తర్వాత ఉర్దూ స్కూల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము, పోలీస్ సిబ్బంది హుటా హుటిన ప్రమాద స్థలమునకు చేరుకొని ప్రమాదము జరిగిన స్థలమును పరిశీలించారు. చనిపోయిన వ్యక్తిని ప్రాతకోటకు చెందిన హరీష్ గా గుర్తించామని తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు.