ఆత్మకూరు: రేపు మండల సర్వసభ్య సమావేశం

56చూసినవారు
ఆత్మకూరు: రేపు మండల సర్వసభ్య సమావేశం
ఆత్మకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 15న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం బుధవారం తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సాధారణ మండల సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈనెల 15 ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

సంబంధిత పోస్ట్