ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అన్వర్ కు స్వాతంత్ర ఉత్తమ పురస్కారం వరించింది. ఈ మేరకు గురువారం నంద్యాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఉత్తమ సేవకు పురస్కారం వరించడం పట్ల కానిస్టేబుల్ అన్వర్ ఆనందం వ్యక్తం చేశారు.