బండి ఆత్మకూరులో సోమవారం యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీవో దస్తగిరి, యోగా శిక్షకుడు నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతిరోజూ యోగా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యం పెరుగుతుందని తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా జీవించవచ్చని సూచించారు.