శ్రీశైలం మండలంలో స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ బస్టాండ్ సెంటర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ సమన్వయకర్త ఆసార్ సయ్యద్ ఇస్మాయిల్ నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాలాది వెంకటయ్య, నాయకులు ధనుంజయ ప్రసాద్, చిన్నయ్య, నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.