తొలి ఏకాదశి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బండి ఆత్మకూరు గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానం నందు ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రాతః కాలాన స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తోపాటు ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.