బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం మహానంది ఎంపీడీవో

59చూసినవారు
బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం మహానంది ఎంపీడీవో
బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఎంపీడీవో మహబూబ్ దౌల, ఈవోఆర్డి నాగేంద్రుడు పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో బుధవారం ప్రతిజ్ఞ చేయించారు. వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు సాంఘికదురాచారం, నేరమన్నారు. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, వారి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్