కొత్తపల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో ఉన్నతాధికారుల సూచనల మేరకు సోమవారం బాల్య వివాహాలు నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ ఐ కేశవ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలని డ్రగ్స్ వాటి వల్ల వచ్చే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మహిళలు మరియు పిల్లలపై నేరాలను అరికట్టడానికి ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.