మహానంది ఆలయం శనివారం భక్తుల సందడి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కొనసాగుతుంది. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాలు తిలకించారు.