శ్రీశైల దేవస్థానంలో ఆదివారం కావడంతో స్వామివారి దర్శనార్థం భక్తులు భారీగా చేరుకున్నారు. ఉదయం నుండి క్యూ లైన్ లో భక్తులు నిలబడ్డారు. భక్తులు శ్రీశైల మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు క్యూ లైన్ లో భక్తులకు తాగునీరు, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.