శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా శుక్రవారం ఎస్. కుమార్, శ్రీశైలం వారిచే కూచిపూడి నృత్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ కూచిపూడి నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మూషికవాహన, వినాయక కౌత్వం, లింగాష్టకం, శివ తాండవం, శివస్తుతిnతదితర గీతాలకు, అష్టకాలకు అమృతవర్షిణి, అక్షయ, వరలక్ష్మీ, అభినయశ్రీ, రామతులసి, తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు.