ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆయన ఆలయంలోని రత్నగర్భ వినాయక స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత వేద ఆశీర్వచన మంటపంలో ఆయనకు అర్చకులు స్వామి అమ్మవార్ల వేద ఆశీర్వచనాలు అందజేయడంతో పాటు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.