శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై బారులు తీరారు. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా టికెట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండడంతో క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.