శ్రీశైలం డ్యామ్ ఫ్లంజ్ పూల్ వద్ద అండర్‌వాటర్ వీడియో చిత్రీకరణ కొనసాగుతోంది. విశాఖకు చెందిన సీలైన్ ఆఫోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిపుణులు నీటిలోకి దిగి లోపలి దృశ్యాలు తీస్తున్నారు. యాప్రాన్ ముందు భాగంలో దెబ్బతిన్న సీలిండర్‌లను కూడా వీడియోలో రికార్డ్ చేశారు. అయితే ప్రతి ఏడూ అధ్యయనం మాత్రమే చేస్తుండటం, శాశ్వత పరిష్కారం లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.