మహానంది క్షేత్రంలో వైభవంగా నందీశ్వరాభిషేకం నిర్వహించారు. సోమవారం భాద్రపద బహుళ త్రయోదశి మహాప్రదోషం సందర్భంగా
నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో ఆలయ వేదపండితులు, అర్చకులు నందీశ్వరునికి పంచామృతాభిషేకం, విశేష దవ్యాభిషేకాలు, హారతి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నందీశ్వరుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.