రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మహానంది తహశీల్దార్ పి. రమాదేవి తెలిపారు. శుక్రవారం మహానంది మండలం మసీదుపురం గ్రామంలో గ్రామసభను నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన భూ రీ సర్వేలో లోపాలు ఉన్నట్టు ఈ ప్రభుత్వం గుర్తించి, వాటిని పరిష్కరించడానికి గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు.