ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారూఫ్ ఆసియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని అలాంటి వారిని స్మరించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.