నంద్యాల జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్ఐల బదిలీలో భాగంగా శనివారం ఆళ్లగడ్డ రూరల్ ఎస్సైగా హరి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన కొత్తపల్లి మండల ఎస్సైగా పనిచేస్తుండగా ప్రస్తుతం ఆళ్లగడ్డ రూరల్ ఎస్సైగా రావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.