ఆత్మకూరు పట్టణంలోని అర్హులైన లబ్ధిదారులకు పేదలకు ఇళ్ల స్థలాలు 3సెంట్లు కేటాయించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు డిమాండ్ గురువారం ఆత్మకూరు కార్యాలయంలో చేశారు. జనవరి 10వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త నిరసన ధర్నాలో భాగంగా ఆర్డీవో కార్యాలయం దగ్గర సీపీఐ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని అర్జీ దారులు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు పిలుపునిచ్చారు.