ఆత్మకూరు మండలంలోని బైర్లూటి చెంచుగూడెంలో గల గిరిజన ఆశ్రమ బాలికల గురుకుల పాఠశాల నందు గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా జాతీయ పతాకాన్ని బిజెపి జాతీయ మహిళా మోర్చా విభాగం సభ్యురాలు, శ్రీశైలం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ మోమిన్ షబానా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమన్నారు.