ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ఆటో స్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆకుతోట రాజశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. బ్రిటిష్ పాలనకు స్వస్తి పలికి స్వరాజ్యంగా ఏర్పడిన శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు.