ముమ్మరంగా వరి నాట్లు

67చూసినవారు
ముమ్మరంగా వరి నాట్లు
ఆత్మకూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ముమ్మరంగా వరినాట్లు మొదలయ్యాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురియడంతో పాటు ఆత్మకూరు మండలంలోని ఆయా గ్రామాల్లో గల చెరువుల్లో సమృద్ధిగా వర్షం నీరు చేరింది. దీంతో ఆయకట్టు రైతులు తమ పంట పొలాల్లో వరినాట్లను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆత్మకూరు మండలంలో గత వారం రోజులుగా వరి నాట్లు ముమ్మరమయ్యాయి. దీంతో రైతులు పంట పొలాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్