స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బుధవారం జాతీయ జెండాను ఆపార్టీ నాయకులు రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సందర్భాల్లో అనేకమంది వీరులు త్యాగం చేసి 200ఏళ్ళు బ్రిటిష్ పాలకులు పరిపాలన నుంచి దేశ విముక్తి చేశారని అన్నారు. స్వతంత్రం కోసం గాంధీ నడిపించిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.