మహానందిలో మహా వైభోగం ప్రదోషకాల నందీశ్వరాభిషేకం

74చూసినవారు
మహానందిలో మహా వైభోగం ప్రదోషకాల నందీశ్వరాభిషేకం
మహానంది క్షేత్రంలో వైభవంగా ప్రదోషకాల నందీశ్వరాభిషేకం గురువారం నిర్వహించారు. కార్తీక బహుళ త్రయోదశి మహా ప్రదోషం సందర్భంగా ఆలయ ఈవో ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు క్షేత్రంలో కొలువైన నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, పుణ్యాహవాచనం, నవదేవతాధ్యానం పీఠపూజానంతరం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకార్చనలు, అలంకార హారతి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్