పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి షైనింగ్ స్టార్ అవార్డ్ ను మహానంది మండల కేంద్రం యం. తిమ్మాపురం ఏపీ మోడల్ స్కూల్ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు అందుకోవటం అభినందనీయమని ప్రిన్సిపాల్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం నంద్యాల లోని ఏయస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డ్ ల సభలో కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా కమలాకర్ , చైతన్యశ్రీ, ఉమామహేశ్వరిబాయిలు ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.