నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం మహానంది క్షేత్రంలో ఈనెల 23న ఉదయం దేవస్థాన హుండీ లెక్కించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. అభిషేక మండపంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, ఏజెన్సీ వర్కర్స్, తదితరులు పాల్గొనాలని కోరారు.