రైతులు తమ పొలంలో పండించుకున్న వరి పంటను విక్రయించేటప్పుడు, ధరలను సీఎం యాప్ లో నమోదు చేయాలని వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్, రైతు సేవ కేంద్రం సిబ్బందికి సూచించారు. మహానంది మండలం తమ్మడపల్లెలో పడిపోయిన వరి పంటలను శుక్రవారం పరిశీలించారు. రైతులకు సూచనలు సలహాలు చేశారు. అక్కడే వరి పంటను రైతు చలమయ్య విక్రయిస్తున్న ధరలను అడిగి తెలుసుకున్నారు. రైతు విక్రయించే ధరలను నమోదు చేయాలన్నారు.