ఉపాధి కూలీలకు వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శి నరసింహ నాయక్ పేర్కొన్నారు. సోమవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 9 వారాల నుండి ఉపాధి కూలీల వేతనాలు, పేస్లిపులు ఇవ్వడం లేదని తెలిపారు.