చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వధ్యేయమని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం బోయరేవుల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్ పెద్ద స్వామన్న అధ్యక్షతన నిర్వహించారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ. 4వేలకు పెంపు, వికలాంగులకు 6, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.