ఆత్మకూరు పట్టణంలోని 24వ వార్డులలో నెలకొన్న పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్ శ్రద్ధ వహించాలని సోమవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రణధీర్ కోరారు. ప్రజలను దోమలు, అంటు రోగాల బారి నుంచి కాపాడాలన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన శివాలయం ముందర పేరుకుపోయిన చెత్తను చూపిస్తూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.