ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. గురువారం శ్రీశైలం కి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఆమె శ్రీశైలానికి చేరుకున్నారు. ముందుగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత వారికి దేవస్థానం అర్చకులు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.