రేపు నరసింహ స్వామి జయంతి వేడుకలు

56చూసినవారు
రేపు నరసింహ స్వామి జయంతి వేడుకలు
ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ ఆలయమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేది ఆదివారం స్వామి వారి జయతి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుఝాము నుంచే అభిషేకాలు, అర్చనలు తదితర పూజా క్రతువులను సంప్రదాయబద్దంగా చేపట్టనున్నారు. అలాగే మధ్యాహ్నం స్వామిఅమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరపనున్నారు.

సంబంధిత పోస్ట్